- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమెను ముద్దు పెట్టుకోవడం నా వల్ల కాదు.. బాలీవుడ్ నటుడు కామెంట్స్
దిశ, సినిమా: సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ హీరోలుగా తెరకెక్కిన సినిమా ‘అంతిమ్: ది ఫైనల్ ట్రుత్’. కాగా ఈ సినిమాలో ఇంటిమేట్ సీన్లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆయుష్. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అంతిమ్’లో ఓ రొమాంటిక్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నప్పుడు చాలా అసౌకర్యానికి గురయ్యానని, చాలా చికాకుగా అనిపించిందని తెలిపాడు. ఇంటిమేట్ సన్నివేశాలు చేయడం చాలా అసౌకర్యంగా భావిస్తానని.. అలాంటివి చేస్తున్నప్పుడు చాలా భయంగా, కంగారుగా ఉంటుందని చెప్పిన ఆయుష్.. ‘అంతిమ్ మూవీలో ‘హోనే లగా’సాంగ్‌లో మహిమా మక్వానాతో రొమాంటిక్ సీన్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇంకేదైన చూడండని దర్శకుడు మహేష్ మంజ్రేకర్‌ను కోరాను. కానీ, అతను ఈ సినిమాకు ముద్దు సన్నివేశం అవసరమని చెప్పాడు.
నేను ఆ సన్నివేశం చేయలేనని చెప్పినా వినకుండా.. సినిమాకి అది తప్పనిసరి అంటూ బలంగా చెప్పాడు’ అని వివరించాడు. ‘సార్ దయచేసి నన్ను ఇలా ఇబ్బంది పెట్టొద్దు. ఇది గ్యాంగ్‌స్టర్ చిత్రం, ప్రేమకథలోకి తీసుకురావద్దు’ అంటూ తనని ఒప్పించేందుకు ప్రయత్నించానని, నటి మహిమతో కూడా తనకు అసౌకర్యంగా ఉందని, డైరెక్టర్‌కు చెప్పమని అడిగానని తెలిపాడు. ఇదంతా విన్న డైరెక్టర్ చిన్నపిల్లాడిలా చేస్తున్నావంటూ.. చాలా సేపు నవ్వుకున్నాడని తెలిపాడు. ఇక మరాఠీ హిట్ మూవీ ‘ముల్షి ప్యాటర్న్’కి రిమేక్‌గా వస్తున్న చిత్రం.. నవంబర్ 26న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.