- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాబోయే భర్తతో బయటకు వెళ్లిన యువతి.. ప్రేమించాలంటూ యువకుడు వీరంగం
దిశ, వెబ్‌డెస్క్ : తనను ప్రేమించాలని ఓ యువకుడు నడిరోడ్డుపై హల్ చల్ చేశాడు. యువతిని, ఆమెకు కాబోయే భర్తను కత్తితో బెదిరిస్తూ వీరంగం సృష్టించాడు. సోమవారం గుంటూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అరండల్ పేట నాలుగో లైన్‌లోని ఓ షాప్‌నకు యువతి తన కాబోయే భర్తతో వచ్చింది. అక్కడికి ఓ యువకుడి వచ్చి తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వేధించాడు. యువతి పక్కన ఉన్న ఆమెకు కాబోయే భర్తను కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. అతడు చాకచక్యంగా తప్పించుకోవడంతో ప్రాణప్రాయం తప్పింది.
యువకుడి వీరంగాన్ని గమనించిన స్థానికులు వెంటనే అతడిని పట్టుకునే ప్రయత్నం చేయడంతో పరారీ అయ్యాడు. అనంతరం యువతి తనకు కాబోయే భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానికులు తీసిన వీడియోలు, సీసీ టీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.