- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రేమ పేరుతో మైనర్ బాలికను నమ్మించి..
by Sumithra |

X
దిశ, మిర్యాలగూడ: ప్రేమ పేరుతో మైనర్ బాలికను వంచించిన కేసులో నిందితుడిని షీ టీం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ మాధురి రెడ్డి వివరాల ప్రకారం పట్టణానికి చెందిన ఓ యువకుడు అతని కజిన్ సిస్టర్ స్నేహితురాలైన మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. స్నేహం పేరిట దగ్గరైన ఆ యువకుడిని నమ్మిన బాలిక, ఇంట్లో దాచి ఉంచిన రూ.40 వేల నగదును దొంగిలించి యువకుని ఖర్చులకు ఇచ్చింది.
ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాలిక తల్లిదండ్రులు షీటీమ్ పోలీసులను ఆశ్రయించారు. షీ టీం గోప్యంగా విచారించి.. బాలికను ట్రాప్ చేసిన విధానం, ఇతర వివరాలను రాబట్టారు. అనంతరం యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మాధురి రెడ్డి తెలిపారు. మహిళలు, యువతులు, విద్యార్థినిలు రక్షణ కోసం షీ టీంను ఆశ్రయించాలని కోరారు.
Next Story