- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం: మైనర్ బాలికను బెదిరించి అత్యాచారం
దిశ, రాజేంద్రనగర్: మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అస్సాం రాష్ట్రానికి చెందిన దంపతులు ఉపాధ కోసం ఇద్దరు కూతుళ్లును తీసుకుని హైదరాబాద్‌కు వచ్చారు. అత్యవసర పనిపై దంపతులు స్వగ్రామానికి వెళ్లాల్సి రావడంతో పిల్లలను శంషాబాద్‌లోని తమ బంధువుల ఇంట్లో వదిలివెళ్లారు. అదే బంగళాలో అద్దెకు ఉంటున్న యూపీకి చెందిన గోపీ అనే వ్యక్తి ఒంటరిగా ఉన్న బాలికపై కన్నేశాడు. బాలికను బెదిరించి బలవంతంగా తన గదికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచార దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోలను యూ ట్యూబ్‌లో పెడతాననంటూ బెదిరించారు. తన వద్ద గన్ ఉంది.. దాంతో నీ తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే బాలిక అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు వైద్యం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు గోపిని అదుపులోకి తీసుకున్నారు.