శ్మశానాల్లోని పుర్రెలు, ఎముకలను అమ్మేస్తోన్న యువకుడు.. ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..?

by Anukaran |   ( Updated:2023-10-10 15:57:25.0  )
John-Pichaya Ferry
X

దిశ, వెబ్‌డెస్క్ : పుర్రెకో బుద్ది అన్నట్టు.. పుర్రెకో రేటు అంటున్నాడు ఈ కుర్రోడు. సోషల్ మీడియా పుణ్యమా అని కొందరు రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిపోతున్నారు. టిక్‌టాక్ ద్వారా సినిమా స్టార్లుగా మారిన వారున్నారు. ఇలా టిక్ టాక్ ద్వారా పబ్లిక్ ఫిగర్‌గా మారిన యువకుడే జాన్-పిచయా ఫెర్రీ. అమెరికాకు చెందిన ఈ 21 ఏళ్ల యువకుడికి 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీనినే క్యాష్ చేసుకున్నాడీ యువకుడు. వినూత్న ఐడియాతో మార్కెట్‌నే తన వైపు తిప్పుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా మనిషి పుర్రెలతో బిజినెస్ చేస్తూ ప్రపంచాన్నే ఆకర్షించాడు.

Skull Busines

న్యూయార్క్ నగరానికి చెందిన జాన్-పిచయా ఫెర్రీ టిక్ టాక్ ద్వారా సెలబ్రిటీ కావడంతో ఫాలోవర్స్ లక్షల్లో పెరిగారు. దీంతో తానే బ్రాండ్ అంబాసిడర్‌గా మారి వివిధ శ్మశాన వాటికల నుంచి ఎముకలు, పుర్రెలు, పుర్రెలోని ఇతర భాగాలు, దంతాలు ఇలా అస్తిపంజరాల అవశేషాలను సేకరించి ప్రదర్శలు పెడుతుంటాడు. అంతేకాక వాటి చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకుంటున్నాడు. ఎముకల అంతర్గత నిర్మాణం అవగాహన కల్పిస్తున్నాడు.

ఆ ఆలయంలో అమ్మవారికి రుతుస్రావం.. మూడు రోజులు దర్శనాలు బంద్

Skull Business

తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు ఓ వైబ్‌సైట్‌ను నడుపుతున్నాడు. తను సేకరించిన పుర్రెలు, ఎముకల చిత్రాలను సోషల్ మీడియాలో పెడితే నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. కొందరూ వాటి కోసం ఆర్డర్లు చేస్తుండగా.. మరి కొందరు దారుణంగా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ పుర్రెల వ్యాపారం అమెరికాలో తప్పేమి కాకపోవడంతో మూడు పుర్రెలు.. ఆరు ఎముకల్లా విజయవంతంగా నడుస్తోంది. వీటిని కళాకారులు, కీళ్ల నిపుణులు, యూనివర్సిటీలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయని జాన్-పిచయా ఫెర్రీ పేర్కొంటున్నాడు. ఇలా నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు ఫెర్రీ వెల్లడించాడు. ఏది ఏమైన అతడి వ్యాపారంలో నెట్టింట వైరల్‌గా మారింది.

ఆ’ పనిలో బోర్ కొట్టకుండా.. భర్తలను, భార్యలను మార్చుకుని శృంగారం

Advertisement

Next Story

Most Viewed