గుంతలో పడ్డ లారీ.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Shamantha N |
గుంతలో పడ్డ లారీ.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరద బీభత్సానికి ఢిల్లీలోని ప్రధాన రోడ్లు నీట మునిగాయి. దీనికితోడు వరద ఉధృతికి రోడ్డు భూభాగం కొట్టుకుపోవడంతో రహదారులపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే న‌జాఫ్‌గ‌ఢ్‌లోని ప్రధాన రహదారి మీదుగా వస్తున్న ట్రక్కు గుంతలో పడిపోయింది. లారీ రన్నింగ్‌లో ఉన్న సమయంలోనే ఒక్కసారిగా రోడ్డు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున అయినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు లారీని బయటకు తీసే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Advertisement

Next Story