హారీపోటర్ రచయిత్రి నుంచి కరోనా కానుక

by vinod kumar |
హారీపోటర్ రచయిత్రి నుంచి కరోనా కానుక
X

ఉద్యోగాలు కోల్పోతాయన్న భయం.. జీతాల్లో కటింగ్స్.. వైరస్ వ్యాప్తి ఆందోళన.. వీటన్నింటి మధ్య ఒక చిన్న గుడ్‌న్యూస్. ఏమిటంటారా? హారీపోటర్ నవలా సిరీస్ రచయిత్రి జేకే రౌలింగ్ కరోనా కానుక ఇవ్వబోతుంది. ఆ కానుక ఏంటంటే.. పిల్లల కోసం ఒక షార్ట్ స్టోరీ. నిజం, శక్తిని తప్పుగా ఉపయోగించడం ఇతివృత్తంగా ఉన్న ఈ కథని ఆన్‌లైన్‌లో ఉచితంగా చదువుకోవడానికి వీలుగా విడుదల చేశారు. ఇంతకీ ఈ షార్ట్ స్టోరీ పేరు చెప్పలేదు కదూ.. ‘ది ఇకబోగ్.’

మొదటి చాప్టర్‌ను మంగళవారమే విడుదల చేయగా.. వారానికో చాప్టర్ చొప్పున జూలై 10 వరకు కథను కొనసాగించనున్నట్లు రౌలింగ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇది హారీపోటర్ కథకు స్పిన్ ఆఫ్ కాదని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. హారీపోటర్ చివరి పుస్తకం ‘హారీపోటర్ అండ్ ది డెత్లీ హాలోస్’ విడుదలైన తర్వాత ఆమె ఈ కథను విడుదల చేయాలనుకున్నారు. కానీ, కుదరలేదు. అప్పటికే రాసుకున్న ఈ కథ మళ్లీ ఈ మధ్య ఆమెకు దొరికిందట. దానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి కరోనా కానుకగా రౌలింగ్ విడుదల చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed