- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాన్నిహిత్యం సాధ్యమే.. సెక్స్ లైఫ్ అపోహలు తొలగించే ప్రయత్నం
దిశ, ఫీచర్స్ : ‘సెక్స్’.. ఈ పదాన్ని పలకడం కూడా తప్పు అనే భావన ఇప్పటికీ చాలామందిలో ఉంది. నేటికీ ఈ అంశంపై సరైన అవగాహన కల్పించలేకపోవడం మూలాన శతాబ్దాలుగా అదో తప్పుడు ఆలోచనగానే ఉండిపోగా.. క్రమంగా ‘నిషిద్ధ’ పదాల జాబితాలోకి చేరిపోయింది. అనేక ఆసియా సంస్కృతుల్లో ఇదే తీరు కొనసాగుతుండగా, మీడియాలోనూ ఈ పదానికి సెన్సార్ తప్పడం లేదు. ఇక పాఠశాల స్థాయిలోనూ లైంగిక విద్యకు స్థానం లేకపోవడంతో ‘సెక్స్’ టాపిక్‌పై ఎవరికీ పూర్తి అవగాహన ఉండటం లేదు. ఇటీవల కాలంలో ‘ఇంటిమసీ ఇష్యూస్’ పెరుగుతున్నా.. చాలామంది వాటి గురించి బయటకు చెప్పుకునే ధైర్యం చేయడం లేదు. డాక్టర్‌ను కలిసి మాట్లాడేందుకు కూడా వెనకడుగు వేస్తు్న్నారు.
దీంతో భార్యాభర్తలు ‘విడివిడి’గానే ఉండిపోతున్నారు. ఈ షార్ట్ గ్యాప్ దంపతుల మధ్య ఎనలేని అగాధాన్ని సృష్టిస్తుండగా.. ఆ లోపే సమస్యకు చెక్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే ‘సెక్స్ ఎడ్యుకేషన్’తో పాటు ‘సాన్నిహిత్య సమస్యలు’ కూడా డిస్కస్ చేయాలని సర్టిఫైడ్ సెక్స్ అండ్ కపుల్స్ కోచ్, కాలమిస్ట్, రచయిత, టెడ్ ఎక్స్ స్పీకర్ పల్లవి బర్నవాల్ చెబుతోంది. లైంగిక ఆనందం చుట్టూ నెలకొన్న అపోహలు, అపరాధ భావనలు తొలగించేందుకు పల్లవి అందిస్తున్న టిప్స్ మీకోసం.
కరోనా గతేడాది ఎవ్వరినీ గడప దాటనీయని విషయం తెలిసిందే. ఆ సమయంలో భార్యభర్తలు 24×7 కలిసి ఉన్నప్పటికీ, ఇద్దరు కూడా లైంగిక ఆరోగ్యాన్ని పొందలేకపోయారని అనేక సర్వేల్లో వెల్లడైంది. జంటల మధ్య శారీరక సాన్నిహిత్యానికి ప్రాధాన్యత తగ్గడంతో వారి మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితమైంది. ఈ క్రమంలోనే స్త్రీ, పురుషులు ‘మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ (ఎండీడీ)’కు గురవుతున్నారు. దీంతో పురుషుల్లో నపుంసకత్వం, అంగస్తంభన, లైంగిక నొప్పి వంటి సమస్యలు ఏర్పడితే.. స్త్రీలలో శృంగార కోరికలు తగ్గిపోయేందుకు దారితీస్తోంది. అంతేకాదు నిస్పృహ, డిప్రెషన్ కూడా ఇంటిమసీ సమస్యలకు కారణంగా నిలుస్తున్నాయి. వీటి వల్ల తమ పార్ట్‌నర్‌తో లైంగికంగా కనెక్ట్ కాలేకపోతుండగా, వారితో సెక్స్ చేయడానికి అనర్హులుగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సెక్స్ చేయడం అసౌకర్యంగానూ, తమ ప్రేమకు అర్హత కాదన్నట్లుగానూ భావిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో.. వారిలో శృంగార ఆసక్తి కలగడం, లైంగికంగా కలుసుకోవడం చాలా కష్టమని సెక్సాలజిస్టులు చెబుతున్నారు.
లైంగిక కార్యకలాపాల చుట్టూ విపరీతమైన ఆందోళనకు దారితీసే ప్రధాన కారణాల్లో OCD కూడా ఒకటి. ఓసీడీ బాధితులు నిరంతరం ఒత్తిడిని అనుభవిస్తూ సెక్స్ లైఫ్‌ను చాలా అసౌకర్యంగా భావిస్తుంటారు. భాగస్వామితో లైంగిక చర్యలో పాల్గొనకుండా ఉండేందుకు తరచూ సాకులు వెతుకుతుంటారు. మరోవైపు OCD.. హైపర్ సెక్సువల్ ప్రవర్తనకు కూడా దారితీస్తుండగా, ఇది ఒక సమస్యగా మారేంతవరకు మాత్రమే సెక్స్ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇక మన ప్రతికూల శరీర చిత్రం(నెగెటివ్ బాడీ ఇమేజ్) లైంగిక అభద్రతకు కారణమవుతుంది. ముఖ్యంగా ప్రతికూల ఆలోచనలు (నా పురుషాంగం ఆ ఆకారంలో ఉండటం నాకు ఇష్టం లేదు/ లేదా/ నాకు పొట్ట బాగా ఉంది) లైంగిక జీవితాన్ని ఆస్వాదించకుండా చేస్తాయి. మానసిక, ఆధ్యాత్మిక, శారీరక, భావోద్వేగాల పరంగానూ ఇంటిమసీ ఇష్యూస్ భార్యాభర్తల బంధాన్ని బీటలువారేలా చేస్తుంది. చిన్ననాటి అనుభవాల(పేరెంట్స్ గొడవ పడటం, బాల్యంలో సెక్సువల్ అబ్యూస్‌కు గురికావడం) వల్ల ఇంటిమసీ ఫియర్ ఉంటుంది. లాక్ ఆఫ్ కమ్యూనికేషన్, మిస్ ట్రస్ట్, హ్యావింగ్ చిల్డ్రన్, యాంగ్జయిటీ, యాంగర్ వంటి కారణాలు కూడా సన్నిహిత సంబంధంపై ప్రభావం చూపుతాయి. లాక్‌డౌన్ టైమ్‌లో ఇలాంటి కేసులు ఎక్కువగా పెరిగాయి.
సాన్నిహిత్య సమస్యలను పరిష్కరించడానికి నిజాయితీ, నాన్ జడ్జిమెంటల్, ఓపెన్‌నెస్ మైండ్ ఉండాలి. మీ అవసరాలు, ట్రిగ్గర్ ఇష్యూస్ గురించి మీ భాగస్వామితో కమ్యూనికేట్ చేయండి. మీకు నచ్చిన, మిమ్మల్ని ప్రేరేపించే వాటిని కనుగొనండి, తద్వారా మీరు మీ భాగస్వామితో బాగా సంభాషించవచ్చు. సాన్నిహిత్య భయాలను తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. . ముందుగా ‘బాడీ ఇమేజ్’ ఇష్యూస్‌పై వర్క్ చేయండి, ఆపై సెక్సువల్ కాన్ఫిడెన్స్‌పై దృష్టి చేయండి. మీ అభద్రతా భావాలు తొలిగితే ఇద్దరి మధ్య ఇంటిమసీ పెరుగుతుంది. దీర్ఘకాలిక సాన్నిహిత్య సంబంధాలను సృష్టించడానికి అవసరమైన అవగాహన పెంచుకోవాలి. మీ వల్ల కాకపోతే సర్టిఫైడ్ మనస్తత్వవేత్త వద్దకు వెళ్లాలి. వారు మీ ఆందోళన, నిరాశ, మానసిక ఆరోగ్య సంబంధిత వ్యాధుల వెనుక గల కారణాలను గుర్తించి, నిర్మాణాత్మక చికిత్స ద్వారా వాటిని పరిష్కరించడంలో సాయపడతారు.
– పల్లవి బర్నవాల్, సెక్స్ అండ్ కపుల్స్ కోచ్