హర్యానాలో బీజేపీ కూటమికి ఎదురుదెబ్బ

by Shamantha N |   ( Updated:2020-12-30 21:44:20.0  )
హర్యానాలో బీజేపీ కూటమికి ఎదురుదెబ్బ
X

దిశ,వెబ్‌డెస్క్: హరియాణాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఎదురు దెబ్బ తగిలింది. హరియాణాలో తొలిసారిగా మేయర్ పదవికి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 3 మేయర్ స్థానాల్లో రెండింటిని బీజేపీ కూటమి చేజార్చుకుంది. అంబాలా మేయర్ పదవిని హరియాణా జనచేతన పార్టీ కైవసం చేసుకుంది. సోనిపేట్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. కాగా పంచకులలో విజయం సాధించడానికి బీజేపీ చెమటోడ్చాల్సి వచ్చింది. సాంప్లా, ధారుహెడా, మున్సిపల్ కమిటీ అధ్యక్ష స్థానాల్లో కూటమికి పరాభవం ఎదురైంది. ఉక్‌లానా మున్సిపల్ కమిటీ అధ్యక్ష స్థానంలోనూ బీజేపీ కూటమికి పరాభవం ఎదురైంది.

Advertisement

Next Story