- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికార పార్టీయైతే… పెద్దపీఠ వేస్తారా…?
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టే ఏ కార్యక్రమంలోనైనా స్టేజీపై కూర్చునేందుకు ప్రోటోకాల్ ఉంటుంది. అది ఏ పార్టీ అధికారంలోనున్న ప్రోటోకాల్ పాటించాల్సిందే. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రోటోకాల్‌కు పెద్దగా ప్రాధాన్యత లేదని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే అయినా… మాజీ ఎంపీ అయినా సరే టీఆర్ఎస్ పార్టీ నాయకుడైతే చాలు. ప్రభుత్వ కార్యక్రమాల్లో స్టేజీపై కూర్చోబెట్టి గౌరవ మర్యాదలు చేస్తారు. అదే ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఏలాంటి గౌరవం ఇవ్వకుండా ఆమర్యాదగా ప్రవర్తించడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెల్లుతుందని బహిరంగాంగనే విమర్శలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో పల్లెప్రగతి కార్యక్రమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రులు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
అయితే ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మంత్రి కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి, సబితా ఇంద్రారెడ్డిలు కలిసి అర్బన్ పారెస్ట్ పార్కును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యుడు కొమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం ఉండదు. కానీ ఇదే జిల్లాలోని మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జరిగిన బస్టాండ్ ప్రారంభోత్సవం, పల్లె, ప్రగతి కార్యక్రమంలో ఎలాంటి ప్రాతినిధ్యం లేని మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకుడు తీగల కృష్ణారెడ్డికి ఆహ్వానం ఉంటుంది. మంత్రులు, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్లతో పాటు ప్రోటోకాల్ ప్రకారం స్టేజీపై కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం ఆయనకు కల్పిస్తారు. అంటే అధికార పార్టీ నేతయైతే అన్ని రకాల గౌరవ మర్యాదలు కల్పించడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికే చెల్లుబాటు అవుతుందని ప్రతిపక్ష పార్టీలు, మేధావులు విమర్శలు చేస్తున్నారు.
సమస్యలపై గళమెత్తితే ప్రోటోకాల్ లేదు…
ప్రజాస్వామ్య పద్దతిలో జరిగే ఎన్నికల ద్వారా ఎన్నుకునే ప్రజాప్రతినిధికి ప్రజలకు సమాధానం చెప్పే బాధ్యత ఉంటుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ప్రజా సమస్యలను తీసుకెళ్లి పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. అయితే సాధరణంగా ప్రతిపక్ష పార్టీలోని ప్రజాప్రతినిధులే అధికార పార్టీకి చెందిన మంత్రులను, ప్రభుత్వాలను సమస్యలపై నిలదీస్తారు. దీంతో ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. దీర్ఘాకాలిక సమస్యలైనా, ప్రమాదకరమైన సమస్యలకు తక్షణమే పరిష్కారించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కానీ వీటిపై గళమెత్తి ప్రశ్నించే నాయకులను కలువడం, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కాకుండా చేసేందుకు అధికార పార్టీ ప్రణాళికలు చేస్తోంది.
ప్రోటోకాల్ పాటించాలంటే ముందుగానే కార్యక్రమం నిర్ణయించుకోని ఒక్క రోజు ముందుగానీ లేకపోతే కార్యక్రమం రోజు ఉదయమే చెప్పి తప్పించుకునేందుకు అధికారులు ప్రయత్నం చేస్తారు. గతంలో గడ్డిఅన్నారం పరిధిలోని ఫ్రూట్ మార్కెట్లో కేటీఆర్ ప్రారంభోత్సవం కార్యక్రమం చెప్పిన సమయం ఒక్కటి, ప్రారంభించింది మరొక సమయం. అయితే ఆ నియోజకవర్గంలో పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి చెప్పిన సమయానికి అక్కడ చేరుకునే లోపే కార్యక్రమం ముగిసిపోయింది. ఈవిధంగా ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను అడుగు అడుగున ప్రోటోకాల్ పాటించకుండా అవమానిస్తున్నారు.