- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
పోలీసుల నిర్వాకం.. వృద్ధుడని కూడా చూడకుండా అలా చేసి
దిశ, చార్మినార్ : ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పోలీసులే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లడం లాంటివి చేస్తారు. కానీ, పోలీసులే యాక్సిడెంట్ చేసి కనీసం బాధితున్ని పట్టించుకోకుండా వెళ్లిపోయిన ఘటన చాంద్రాయణ గుట్టలో చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే .. చాంద్రాయణగుట్ట పోలీస్టేషన్‌కు చెందిన టీఎస్ 09 పీఎ 5441 నెంబర్ గల పెట్రోలింగ్ వాహనంపై శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. బుధవారం రాత్రి బండ్లగూడ నూరీ ఫంక్షన్ హాల్ వద్ద అటుగా వెళ్తున్న దారుల్షిఫా కు చెందిన షా మహ్మద్ యూసుఫుద్దీన్(65) వృద్ధున్ని ఢీ కొట్టింది. ఆక్టీవా పై నుంచి కింద పడిన యూసుఫుద్దీన్‌కు తీవ్ర గాయలయ్యాయి. కనీసం గాయపడిన వృద్ధున్ని ఆసుపత్రికి తీసుకెళ్లాలి అనే సంగతే మరిచారు పోలీసులు. ఆ వృద్దున్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లాలన్న ఆలోచన పెట్రోలింగ్ కారులో ఉన్న పోలీసులు మరిచారు. దీంతో ఘటన జరిగిన స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్ష్యులు గాయపడిన బాధితున్ని ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనను ప్రత్యక్షంగా చూసిన సాక్షులు చాంద్రాయణగుట్ట పెట్రోలింగ్ వాహనంకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.