ఒలింపిక్స్ నిర్వహణ కమిటీలోని వ్యక్తికి కరోనా..

by vinod kumar |
ఒలింపిక్స్ నిర్వహణ కమిటీలోని వ్యక్తికి కరోనా..
X

టోక్యో ఒలింపిక్స్ – 2020 నిర్వహణ కమిటీలోని సిబ్బంది ఒకరికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. టోక్యోలో ఉన్న నిర్వహణ కమిటీ ప్రధాన కార్యాలయంలో పని చేసే ఆ వ్యక్తి (35)కి కరోనా పాజిటివ్ తేలినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నఅతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. కాగా, ప్రధాన కార్యాలయంలో అతడు పని చేసిన ప్రదేశంతో పాటు తిరిగిన ప్రాంతాలన్నింటినీ శానిటైజ్ చేశామని.. అతడి సహోద్యోగులందరినీ ఇండ్ల వద్దే ఉండమని ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

కాగా, టోక్యోలో ఏర్పాటు చేసిన ఒలింపిక్స్ 2020 కార్యాలయంలో 3,500 మంది సిబ్బంది పని చేస్తున్నారు. కరోనా ప్రభావం పెరిగిన తర్వాత 90 శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పని చేస్తుండగా.. అత్యవసర సేవలు, ఇతర ముఖ్యమైన శాఖల ఉద్యోగులు రొటేషన్ పద్ధతిలో కార్యాలయానికి వస్తున్నారు. అలా వస్తున్న వారిలోనే ఒకరికి కరోనా సోకింది. కార్యాలయానికి సిబ్బంది రాకపోవడం వల్ల బాధితుల సంఖ్య ఒకరికే పరిమితమైందని.. లేకపోతే తీవ్ర నష్టం జరిగేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Tags: Tokyo, Corona Passitive, Home quarantine, Olympics

Advertisement

Next Story

Most Viewed