- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ధాన్యం లారీకి తప్పిన ప్రమాదం

X
దిశ, మెదక్: ధాన్యం లోడుతో వెళ్తున్న లారీకి పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగ్ మండలం సంకాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో 500 బస్తాల ధాన్యాన్ని లోడ్ చేసుకుని రామయంపేట రైస్ మిల్లుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో సంకాపూర్ ప్రధాన రహదారిలో కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు ఉండగా.. లోడుతో వెళ్తున్న లారీ ఆ తీగలకు తగలడంతో మంటల చెలరేగాయి. అప్రమత్తమైన లారీ డ్రైవర్ కిందకు దూకాడు. గ్రామంలోనే ఘటన జరగడంతో గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ధాన్యం బస్తాలను కిందికి తోసివేయండతో లారీకి, ధాన్యానికి ఎలాంటి నష్టం జరగలేదు.
Tags: missed hazard, lorry, carrying, grain load, medak, Electric wires
Next Story