మెరుగైన విద్యా విధానంపై దృష్టి

by Shyam |
మెరుగైన విద్యా విధానంపై దృష్టి
X

దిశ, న్యూస్‌బ్యూరో: కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమల్లోకి తెస్తున్న నేపథ్యంలో మెరుగైన విద్యావిధానం, ప్రణాళిక, సుపరిపాలన తదితర అంశాలపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి, సెంటర్ ఫర్ ఎకానమిక్ అండ్ సోషల్ స్టడీస్ ( సెస్ ) మధ్య శనివారం కౌన్సిల్ కార్యాలయంలో అవగాహన ఒప్పందం ( ఎంఓయూ ) కుదిరింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ వినోద్‌కుమార్ సమక్షంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి. పాపిరెడ్డి, సెస్ డైరెక్టర్ ఈ.రేవతి ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేసి, పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. రాష్ట్రంలో ప్రైమరీ నుంచి ఉన్నత విద్యవరకు నూతన ఒరవడిలో విద్యా విధానం కొనసాగాలని, ఈ విషయంలో సమగ్ర విశ్లేషణ, రీసెర్చ్ కోసం ఈ ఎంఓయూ జరిగింది. ఉన్నత విద్యలో కోర్సులను మరింత పదును పెట్టడం, వృత్తిపరంగా టీచర్లు మరింత రాటు తేలడం, సామాజిక, ఆర్థిక పరమైన ప్రణాళికల రూపకల్పన వంటి పలు అంశాలపై సెస్ సమగ్రమైన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు సమన్వయం చేసేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ వెంకట రమణ, లింబాద్రి, కార్యదర్శి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed