- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాకు కిరోసిన్ వైద్యం.. నెగెటివ్ రిపోర్ట్‌తో షాక్
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా రాకుండా ఇలా చేయాలి.. అలా చేయాలి అంటూ సోషల్ మీడియా వేదికగా వేలాది సలహాలు పోస్ట్ చేస్తున్నారు నెటిజెన్లు. అవి ఎంత వరకు నిజమో పోస్ట్ చేసే వ్యక్తికి కూడా తెలియదు. కానీ కొందరు వాటిని అనుసరించి ప్రాణాలను మీదికి తెచ్చుకున్నారు. మరి కొంతమంది మృత్యు ఒడిలోకి జారుకున్నారు. తాజాగా ఓ వ్యక్తి కరోనా సోకిందని కిరోసిన్ తాగి మృతిచెందాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
భోపాల్‌లోని శివ్‌నగర్ ప్రాంతానికి చెందిన మహేంద్ర(30) టైలరింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఆయన కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానికంగా మెడికల్ స్టోర్స్ లో మందులు తెచ్చి వేసుకున్నా తగ్గలేదు. దీంతో తనకు కరోనా సోకిందని భావించాడు. అంతకు ముందే ఓ వ్యక్తి.. కరోనా నివారణకు కిరోసిన్ తాగాలని చెప్పినట్లు మహేంద్రకు గుర్తుకు వచ్చింది. దీంతో ఆయన గత బుధవారం కిరోసిన్ తాగాడు. తనకు కరోనా తగ్గిపోతుందని అనుకున్నాడు. కానీ అప్పటికే ఆయన అస్వస్థకు గురయ్యాడు.
కుటుంబ సభ్యులు మహేంద్రను ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. అయితే వైద్యులు అతడికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. తనకు వచ్చిన జ్వరాన్ని కరోనా అనుకుని మహేంద్ర జీవితాన్ని కోల్పోయాడు. ఇలా సోషల్ మీడియాలో వచ్చే కరోనా ట్రిట్ మెంట్ ను అనుసరించి ప్రాణాలు పోగొట్టుకోవడం విషాదకరంగా మారింది.