కరోనా విజృంభణ.. ఆరెగూడెంలో లాక్‌డౌన్

by vinod kumar |   ( Updated:2021-07-10 10:49:34.0  )
కరోనా విజృంభణ.. ఆరెగూడెంలో లాక్‌డౌన్
X

దిశ, పాలేరు: రాష్ట్రంలో అనేకచోట్ల కరోనా మహమ్మారి బారినపడి జనం మృత్యువాత పడుతూనే ఉన్నారు. అయినా చాలామందిలో మార్పు రావడం లేదు. నిబంధనలు పాటించకుండా.. గుంపులు గుంపులుగా తిరుగుతూ వైరస్ ప్రభలడానికి ఆజ్యం పోస్తున్నారు. తాజాగా.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆరెగూడెంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. సుమారు పదిరోజుల క్రితం గ్రామంలో దాదాపు 28 మంది కరోనాబారినపడ్డారు. ఈ కేసులు రోజూ మరింత పెరుగుతూ 34కు చేరినట్లు తెలిపారు. అంతేగాకుండా.. కరోనాతో ఇటీవల గ్రామంలో ఓ వ్యక్తి మరణించాడని వెల్లడించారు. దీంతో ఒకేసారి ఇన్ని కేసులు నమోదు కావడంతో ఆందోళన చెందిన పాలకవర్గం గ్రామంలో లాక్‌డౌన్ విధించుకున్నారు. వారం రోజులపాటు లాక్‌డౌన్‌ పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గ్రామంలో కఠిన ఆంక్షలు విధించుకున్నారు.

ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసరాల దుకాణాలను తెరిచేందుకు అనుమతిచ్చారు. ఉదయం 10 గంటల తర్వాత అత్యవసరమైతేనే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, ఆంక్షలను ఉల్లంఘించి ఎవరైనా బయటకు వస్తే రూ.500 నుంచి వెయ్యి వరకు జరిమానా విధిస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో 10గంటల తర్వాత కూడా ఎవరైనా కిరాణా షాపులు తెరిస్తే వారికి రూ. 10,000 జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం గ్రామస్తులు బోదులబండ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శంకర్ నాయక్ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. లాక్‌డౌన్‌ను గ్రామస్తులు తప్పకుండా పాటించాలని సర్పంచ్ దొనకొండ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి కట్టెకోల రామారావు కోరారు.

Advertisement

Next Story

Most Viewed