తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర రూ.150 ?

by Shyam |
diesel prices
X

దిశ, డైనమిక్ బ్యూరో : పెట్రో ధరలు సామాన్యుడిని మరింత ఇబ్బందులకు గురిచేస్తోన్నాయి. వాహనదారుడికి తెలియకుండానే రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పెట్రోల్ ధరలు కొన్నినెలల క్రితమే వంద మార్క్‌ను దాటగా.. ఇటీవల డీజిల్ ధరలు కూడా సెంచరీ దాటేసింది. దీంతో వాహనాన్ని రోడ్డెక్కించాలంటే సామాన్యుడు ఆలోచించాల్సి పరిస్థితి ఏర్పడింది. ప్రతి రోజు లీటర్ పై 36 పైసలు, డీజిల్ పై 30 నుంచి 38 పైసలు లెక్కన పెరుగుతూ పోతుండటంతో పెట్రో ధరలు అమాంతం ఆకాశానంటాయి.

శనివారం లీటర్ పెట్రోల్ ధర రూ.113.36, లీటర్ డీజిల్ ధర రూ.106.60గా ఉంది. కేవలం అక్టోబర్ నెలలో మొత్తం 21 సార్లు పెట్రో ధరలు పెంచడం గమనార్హం. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30న లీటర్ పెట్రోల్ ధర రూ.105.71 ఉండగా.. నెల రోజుల్లోనే రూ.8 పెరిగింది. అంటే పెట్రో ధరలు ఇలానే పెరిగితే మరో నాలుగు నెలల్లో లీటర్ పెట్రోల్ రూ.150 లకు చేరువలో ఉండే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా పెరిగిన ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న వాహనదారులకు మరింత భారం కలిగించే అవకాశం లేకపోలేదు.

Advertisement

Next Story

Most Viewed