- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, కుత్బుల్లాపూర్ : ఎప్పుడైనా నగరంలోని పలు ప్రాంతాల్లో చెక్‌పోస్ట్ లు పెట్టడం పరిపాటే. అయితే టెంట్ వేయడం, చిన్న క్యాబిన్లు కట్టించడం మాత్రమే మనకు తెలుసు. కానీ లాక్ డౌన్ సందర్భంగా పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుచిత్ర చౌరస్తాలో ఏకంగా ఇల్లునే కట్టించారు. అదేంటి పర్మనెంట్ ఇళ్లు కట్టించడం ఏందని అనుకుంటున్నారా…? అయితే ఆగండి పూర్తి వివరాలు చెబుతాను.
ఇటీవల నగర శివారులోని వ్యవసాయ క్షేత్రాలు, సంపన్నులు అయితే మొబైల్ ఇళ్లను ఏర్పాటు చేసుకుంటారు. అయితే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూలపల్లి లో మొబైల్ ఇండ్ల తయారీ పరిశ్రమ ఉంది. ఆ నిర్వహకుడు పోలీసుల కష్టాలను చూసి టెంట్ వేస్తే గాలికి కులుతుందని, పోలీసులు గాయాలకు గురై అవకాశముందని గ్రహించాడు. పరిశ్రమలోని ఓ మొబైల్ ఇల్లును చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసి పోలీసులు ఇబ్బందులకు గురి కాకుండా ఈ ఇల్లును ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.