Ap News: ఎమ్మెల్యే కొలికిపూడిపై అధిష్టానం సీరియస్.. కీలక ఆదేశాలు

by srinivas |
Ap News: ఎమ్మెల్యే కొలికిపూడిపై అధిష్టానం సీరియస్.. కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు(MLA Kolikipudi Srinivasa Rao) మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. తిరువూరు(Tiruvur)లో స్థానిక నేత రమేశ్ రెడ్డిపై కొలికిపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రమేశ్ రెడ్డిపై రెండు రోజుల్లో చర్యలు తీసుకోవాలని , లేని పక్షంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఆయన వ్యవహారంపై అధిష్టానం దృష్టి పెట్టింది. నివేదిక ఇవ్వాలని ఎంపీ, జిల్లా అధ్యక్షుడు, సమన్వయకర్తకు సూచించింది. 10 నెలలుగా తిరువూరులో జరిగిన ఘటనలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

కాగా టీడీపీ నేత రమేశ్ రెడ్డి ఓ గిరిజన మహిళతో అసభ్యంగా మాట్లారంటూ ఫోన్ కాల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో రమేశ్ రెడ్డి తీరుపై స్థానిక గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో రమేశ్ రెడ్డి వ్యవహారంపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు సంచలన వ్యక్తం చేశారు. పది రోజుల క్రితమే సురేశ్ రెడ్డి తీరును టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించారు. సురేశ్ రెడ్డిపై రెండు రోజుల్లో చర్యలు తీసుకోకపోతే తాను రాజీనామా చేస్తానని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జయలేకపోతే తాను ఎమ్మెల్యేగా ఉండటం ఎందుకంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఎమ్మెల్యే కొలికిపూడిపై కొంతకాలంగా టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. పార్టీ సూచనలను పట్టించుకోవడంలేదని ఆయనపై స్థానిక టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో అందరినీ కలుపుకుని పోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొలికిపూడి వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈసారి అధిష్టానం కఠిన హెచ్చరికలు జారీ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Next Story

Most Viewed