- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టిక్‌టాక్‌ను ఇకపై వాడబోమన్నది 21 శాతమే !
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలే చైనా దళాలు.. 20 మంది భారత సైనికుల్ని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇండియా, చైనా సరిహద్దుల విషయంలో ఇంకా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. మరోవైపు కరోనా వైరస్‌కు కూడా చైనానే కారణమని అమెరికా నొక్కి చెోబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా ప్రొడక్ట్స్, యాప్స్ బ్యాన్ చేయాలంటూ.. ఇండియన్స్ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. సెంట్రల్ మినిస్టర్స్ నుంచి రాష్ట్ర నాయకుల వరకు అందరూ దీనికి మద్దతు తెలుపుతున్నారు. చైనా యాప్స్ కూడా బ్యాన్ చేస్తారంటూ ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే భారతీయుల్లో అసలు ఎంతవరకు చైనా బ్రాండ్లపై సెంటిమెంట్ ఉందో తెలుసుకోవడానికి ‘ద ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ బ్రాండ్స్ (ఐఐహెచ్‌బీ)’ గన్ షాట్ టెలీఫోనిక్ సర్వే చేపట్టింది.
టిక్‌టాక్ చైనా యాప్ అని తెలిసిన వారు – 56శాతం మంది
టిక్‌టాక్ చైనా యాప్ అని తెలియని వారు – 32శాతం
టిక్‌టాక్ చైనా యాప్ అని తెలిసి .. అన్‌ఇన్‌స్టాల్ చేస్తామన్నవారు – 21శాతం
అన్ ఇన్‌స్టాల్ చేస్తామో లేదో అని అనుమానంగా చెప్పింది – 62శాతం
టిక్‌టాక్ ఇన్‌స్టాల్ చేయమని చెప్పింది – 11శాతం
వివో, శాంసంగ్, ఒప్పో, పానసోనిక్, నోకియా, వన్ ప్లస్, రియల్ మీ, రెడ్ మీ.. ఇలా పలు ఫోన్ బ్రాండ్లు ఏ దేశానికి చెందినవో తెలుసా? తెలియదా? అని కూడా యూజర్లను ప్రశ్నలు అడిగారు. చాలా మందికి చైనీస్ యాప్స్ తెలియడం లేదు. అంతేకాదు ‘చైనీస్ యాప్స్‌పై అవగాహన కూడా లేదు. తాము వాడుతున్నవి లోకల్ యాప్స్ అనే అనుకుంటున్నారు. అంతేకాదు అవి ఏ దేశం వాళ్లు డెవలప్ చేస్తే తమకు ఏంటని కేరే చేయడం లేదు’ అని ఐఐహెచ్‌బీ రిపోర్ట్ తెలిపింది.
ఈ సర్వేలో పాల్గొన్న 84శాతం మంది సెలబ్రిటీలు మాత్రం.. ‘చైనీస్ బ్రాండ్స్‌కు సపోర్ట్ చేయడం, ప్రమోట్ చేయడం తమకు ఇష్టం లేదని’ అన్నారు. అదే విధంగా ‘మన సైనికులు చైనీయుల చేతిలో చంపబడ్డారు. ఇది యుద్ధనీతి కాదు. ఇది దొంగ దెబ్బ. కరోనా వైరస్‌కు చైనానే కారణం. ఇండియన్ బ్రాండ్స్‌నే సపోర్ట్ చేస్తాం’ అని సర్వేలో పాల్గొన్నవారు తెలిపారు.