- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బార్డర్ లో హై అలర్ట్.. ఆర్మీ క్యాంప్ పై మళ్లీ గ్రనేడ్ ఎటాక్..

X
దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ లో సోమవారం ఉదయం జరిగిన పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. పఠాన్ కోట్ లో ఉన్న ఆర్మీ క్యాంప్ సమీపంలో త్రివేణీ గేట్ దగ్గర ఈ గ్రానేడ్ దాడి జరిగింది. దీంతో అప్రమత్తమైన ఆర్మీ ఆ ప్రదేశాన్ని తన కంట్రోల్ లోకి తీసుకుంది. భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. అలాగే జమ్మూ-పఠాన్ కోట్ హైవే లో చెక్ పోస్టులను మరింత అప్రమత్తం చేశారు. అటుగా వెళుతున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తణికీ చేస్తున్నారు.
దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నామని, దగ్గర్లో ఉన్న అన్ని సీసీ కెమెరా ఫుటేజీలను తెప్పించుకుంటున్నామని పఠాన్ కోట్ స్పెషల్ పోలీస్ సురేంద్ర లాంబా తెలిపారు. విచారణ మరింత వేగవంతం చేస్తున్నామని వివరించారు.
Next Story