- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం
by Shyam |

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం… గౌలిగూడ ప్రాంతానికి చెందిన సాగర్ అదే ప్రాంతంలో నాలుగు అంతస్థుల భవనంలో లక్మి సాయి ట్రేడర్స్ పేరుతో బెల్టులు, బ్యాగులు, ఇతర లెదర్ గూడ్స్ వస్తువులు విక్రయాలు నిర్వహిస్తున్నారు. రాత్రి 7.30 గంటల సమయంలో దుకాణం మూసి వెళ్లిగా… 9.30గంటల సమయంలో భవనం మొదటి అంతస్థులో షార్ట్ సర్క్యుట్ తో మంటలు వచ్చి పైకి వ్యాపించాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా… ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. విషయం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరుపై అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో రూ. లక్షల్లో ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.
Next Story