- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రాక్టర్ ర్యాలీలో విషాదం.. ఢిల్లీలో రైతు మృతి
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానీ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో ఓ రైతు మరణించాడు. సెంట్రల్ ఢిల్లీలోని మింటో రోడ్ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో అదే ట్రాక్టర్ కింద పడి రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో రైతులు ఆగ్రహానికి గురైన రైతులు మరణించిన సదరు రైతుపై జాతీయ జెండా కప్పి ఐటీఓ ఇంటర్ సెక్షన్ వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల కాల్పలు వల్లే రైతు మరణించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాక్టర్‌ను మలుపు తీసుకునే సమయంలో పోలీసులు కాల్పులు జరిపారని, ఆ ప్రమాదంలో రైతు మరణించాడని వెల్లడించారు. ఈ క్రమంలో మరికొందరు రైతులు ట్రాక్టర్ ర్యాలీతో ఎర్రకోటకు చేరుకొని, ఎర్రకోటపై కిసాన్ జెండా ఎగరేశారు.