- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒంటరిగా ఆ మూవీస్ చూసే దమ్ముందా.. అయితే ఆ ఉద్యోగం మీదే!
దిశ, ఫీచర్స్: మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు తమ ప్రొడక్ట్స్ సేల్స్ పెంచుకునేందుకు ఫెస్టివల్స్, స్పెషల్ డేస్ సందర్భంగా ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి. అలాగే మూవీస్ విషయానికొస్తే.. కొత్త సినిమాలు విడుదలైనపుడు ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసేందుకు టికెట్ల కొనుగోలుపై క్యాష్ బ్యాక్ ఆఫర్స్, లక్కీ డ్రాలు అనౌన్స్ చేస్తుంటారు. ఇదే క్రమంలో ఓ ఫైనాన్స్ కంపెనీ అక్టోబర్ నెలలో 13 హార్రర్ మూవీస్ చూసిన వ్యక్తులకు 1300 డాలర్లు చెల్లిస్తామని ప్రకటించింది.
ఫైనాన్స్ బజ్ అనే ఫైనాన్స్ కంపెనీ.. హార్రర్ మూవీ హార్ట్ రేట్ ఎనలిస్ట్‌గా ఒకరిని నియమించాలని చూస్తోంది. ఈ మేరకు సదరు వ్యక్తికి 13 అతి భయంకరమైన సినిమాలను చూపించనుండగా.. ఆ టైమ్‌లో ఫిట్‌బిట్(హెల్త్ ట్రాకర్)ను ఉపయోగించి వారి హార్ట్ బీట్ రేటును మానిటర్ చేస్తామని కంపెనీ ఒక వార్తా ప్రకటనలో తెలిపింది. రాబోయే స్పూకీ సీజన్(హార్రర్ మూవీ ఫెస్టివల్)ను పురస్కరించుకుని, అధిక బడ్జెట్ హార్రర్ సినిమాలు తక్కువ బడ్జెట్ సినిమాల కంటే ఎక్కువగా భయపెడుతున్నాయా? లేదా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. ఇందుకోసం 13 సినిమాల జాబితాను సిద్ధం చేయగా, ఇవి చూస్తున్నప్పుడు ఫిట్‌బిట్‌ను ధరించాల్సి ఉంటుంది. దీని ద్వారా హృదయ స్పందన రేటును మానిటర్ చేస్తూ.. సినిమాలను భయంకరంగా మలచడంలో బడ్జెట్ ఎంతవరకు ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు.
ఇందుకోసం ఎంపికైనవారు అక్టోబర్ 9 నుంచి 18వ తేదీ వరకు ‘సా, అమిటీవిల్లే హార్రర్, ఏ క్వైట్ ప్లేస్, ఏ క్వైట్ ప్లేస్ పార్ట్ 2, క్యాండిమాన్, ఇన్సిడియస్, ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్, సినిస్టర్, గెట్ అవుట్, ది పర్జ్, హాలోవీన్ (2018), పారానార్మల్ యాక్టివిటీ, అన్నాబెల్లె’ చిత్రాలు చూడాల్సి ఉంటుంది. ఎంపికైన వ్యక్తికి ఈ 13 చిత్రాలను చూసినందుకు గాను 1,300 డాలర్లతో పాటు ఫిట్‌బిట్ ట్రాకర్‌ను ఫైనాన్స్ బజ్ కంపెనీ అందజేయనుండగా.. హార్రర్ మూవీ ఫెస్టివల్ కోసం 50 డాలర్ల గిఫ్ట్ కార్డును కూడా ఇవ్వనుంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 26 కాగా, ఆసక్తి గల వ్యక్తులు ఆలోగా తాము అప్లయ్ చేస్తున్న ఉద్యోగానికి ఏవిధంగా సూటబుల్ అనే వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. కంపెనీ అక్టోబర్ 1 నాటికి సరైన వ్యక్తిని ఎంపిక చేస్తుంది.