- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిగ్విజయ్ సింగ్ సహా.. 11 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై కేసు
by Shamantha N |
X
భోపాల్: మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ సహా పదిమంది కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. గోవింద్‌పురలోని ఇండస్ట్రీయల్ ఏరియాలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన లఘు ఉద్యోగ్ భారతికి 10వేల చదరపు అడుగుల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి దిగ్విజయ్ సింగ్ నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్‌లను ప్రయోగించారు. కాగా, ఆ ఏరియాలో 144 సెక్షన్ అమలులో ఉందని, దాన్ని కాంగ్రెస్ నేతలు ఉల్లంఘించారని పోలీసులు తెలిపారు. అందుకే వారిపై సెక్షన్ 188, 147, 269 కింద కేసు నమోదు చేసినట్టు అశోక గార్డెన్ పోలీసులు చెప్పారు
Advertisement
Next Story