- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
60 ఏళ్ల కామపిశాచి.. ఆరేళ్ల బాలిక బట్టలు విప్పి ముద్దులు పెడుతూ
దిశ, పాలేరు: రోజురోజుకూ మహిళలపై జరిగే అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. చిన్నా, పెద్ద.. వావివరస మరిచి కామంతో కళ్లుమూసుకుపోయిన కొంతమంది మగాళ్లు మృగాళ్లుగా మారుతూ చిన్నారులను చిదిమేస్తున్నారు. వారికి బొమ్మలిస్తా, స్వీట్లు ఇస్తా అని ఆశ చూపి, వారి అమాయకత్వాని ఆసరాగా తీసుకొని కామకోరికలు తీర్చుకుంటున్నారు. తాజాగా ఓ ఆరేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యచారానికి పాల్పడ్డ దారుణ ఘటన ఖమ్మంలో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే మోటాపురానికి చెందిన భార్యాభర్తలు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడబిడ్డలు. వీరి ఇంటి ఎదురుగా బాణోత్ దీప్లానాయక్(60) అనే వృద్ధుడు నివసిస్తున్నాడు. కాగా, బుధవారం చిన్నారి తల్లి బొప్పాయి ముక్కను దీప్లానాయక్ వాళ్ళింట్లో ఇచ్చి రమ్మని చెప్పి పంపింది. చిన్నారి వెళ్లి చాలాసేపు అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో అనుమానించిన తల్లి, వృద్దుడి ఇంటికి వెళ్లి చూడగా చిన్నారి ఒంటిపై బట్టలు లేకుండా బాణోత్ దీప్లా పక్కన పడుకోని ఉండడాన్ని చూసింది. పాపకు డ్రాయర్ లేకపోవడంతో ఆందోళన చెందిన తల్లి పాపను ఏం జరిగిందని అడిగింది. దీంతో చిన్నారి తాత ముద్దుపెట్టుకున్నట్లు చేశాడని తెలిపింది. డ్రాయర్ ఎందుకు తీశావని అతన్ని నిలదీయగా టాయిలెట్ కి వెళ్లి తడిసి తీసినట్లు తెలిపాడని చెబుతోంది. దీనితో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు నేలకొండపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసారు. వెంటనే ఎస్సై అశోక్ రెడ్డి అనుమానితుడ్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సీడీపీఓ బాలాత్రిపురా సుందరి నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తల్లిదండ్రులతో,అటు పాపా వివరణ మేరకు వైద్య పరీక్షల నిమిత్తం చిన్నారిని ఆసుపత్రికి తరలించారు