Rain Alert: బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం.. మూడు రోజుల పాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

by Shiva |
Rain Alert: బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం.. మూడు రోజుల పాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: వాయువ్య బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి పశ్చిమ వాయువ్య దిశగా వేగంగా కదులుతోంది. ఈ మేరకు రానున్న 72 గంటల్లో తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా హైదారాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre) హెచ్చరికలు జారీ చేసింది. గురువారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఐఎండీ అధికారులు (IMP Officials) వెల్లడించారు.

ఇక శుక్రవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో గంటకు 40 నుంచి50 కి.మీ వేగంగా ఈదరుగాలులు వీస్తూ అక్కడక్కడ మోస్తరు వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఖమ్మం, మహబూబాబాద్‌, జనగా, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు అధికారులు ఇప్పటికే ఎల్లో అలర్ట్‌ (Yellow Alert)ను జారీ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని కోస్తా జిల్లాలో ఇప్పటికే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story