Cold Wave : తెలంగాణలో పంజా విసురుతున్న చలి

by M.Rajitha |
Cold Wave : తెలంగాణలో పంజా విసురుతున్న చలి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో చలి తీవ్రత(Cold Wave) పెరుగుతోంది. గత పది రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు ఏకంగా 15 డిగ్రీల కంటే తక్కువ నమోదయ్యాయి. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎకువగా ఉందని హైదరాబాద్‌ వాతావరణశాఖ(Hyderabad Meteorological Department) అధికారులు వెల్లడించారు. చలికి తోడుగా భారీ పొగ మంచు ఉండటంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం మెదక్‌లో అత్యల్పంగా 14.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత‌లు న‌మోదు కాగా.. ఆదిలాబాద్‌లో 15.7 డిగ్రీల సెల్సియస్‌, పటాన్‌చెరులో 16.2, దుండిగల్‌లో 18, నిజామాబాద్‌లో 18.7, రామగుండం, హనుమకొండ, హకీంపేటల్లో 19, హైదరాబాద్‌లో 19.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. అయితే పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణంగానే నమోదవుతున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది.

Advertisement

Next Story