- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేదలకు గుడ్ న్యూస్.. ఉచిత విద్యుత్‌పై కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: ఉచిత విద్యుత్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరెంట్ కష్టాలు లేని దేశ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గురువారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలోని కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ సెటప్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఇంటికి 300 యూనిట్ల సోలార్ విద్యుత్ ఉచితంగా అందిస్తామని ప్రకటన చేశారు.
దీంతో ప్రతి కుటుంబానికి ఏటా రూ.15-18 వేలు ఆదా అవుతుందని తెలిపారు. వినియోగం పోగా మిగిలిన విద్యుత్‌ను పంపిణీ సంస్థలకు విక్రయించవచ్చని చెప్పారు. వచ్చే 5 ఏళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం కానుందని.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. పదేళ్ల ఎన్డీఏ పాలనలో పేదరికం నుంచి 25 కోట్ల మందికి విముక్తి లభించిందని తెలిపారు.