- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Talasani Srinivas Yadav :సొంత ఇలాకాలో మంత్రి తలసానికి భారీ షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేత!
దిశ, బేగంపేట: సొంత ఇలాకాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు భారీ షాక్ తగిలింది. సనత్ నగర్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ లో కీలక వ్యక్తి పార్టీకి రాజీనామా చేశారు. మంత్రికి అత్యంత సన్నిహితుడైన సరోజినీదేవి ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ రవీందర్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈనెల 28న రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జి మాణిక్ రావు థాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. 2014 నుంచి మంత్రి వెంట నడిచిన ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసహనంతో ఉంటూ పార్టీతో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
సనత్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలోకి దిగేందుకు ఇప్పటికే ఢిల్లీ పెద్దలను కలిసినట్టు సమాచారం. అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన రవీందర్ గౌడ్ పార్టీకి సేవలు అందిస్తూ వస్తుండగా సెగ్మెంట్ లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. గౌడ సామాజికవర్గం 40,000 వేల ఓట్లు ఉండడం విశేషం. ఇప్పటికే కూన వెంకటేష్ గౌడ్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి తిరిగి టీడీపీ గూటికి చేరినది తెలిసిందే. రవీందర్ గౌడ్ ‘దిశ’తో మాట్లాడుతూ మంత్రితో నియోజకవర్గ ప్రజలు విసుగు చెందారని ఈసారి మార్పు కోరుకుంటున్నారని వెల్లడించారు. సనత్ నగర్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన స్పష్టంచేశారు.
Also Read: ఆరుగురు సిట్టింగ్లకు టికెట్ కట్..?