మా వారికి క్షణాల్లో స్ఖలనం అవుతుంది.. ప్లీజ్ ఆయన నాకు ముఖ్యం

by Bhoopathi Nagaiah |
మా వారికి క్షణాల్లో స్ఖలనం అవుతుంది.. ప్లీజ్ ఆయన నాకు ముఖ్యం
X

మేడమ్! నాకు వివాహమై 19 సంవత్సరాలవుతోంది. నా వయస్సు 35 సంవత్సరాలు. మా వారికి నేనంటే చాలా ప్రేమ. ఆయనకు శీఘ్రస్థలన సమస్య మొదట్నించీ ఉంది. మొదట్లో ఫర్వాలేదనిపించినా మెల్లగా ఆది ఎక్కువైంది. క్షణాల్లో స్థలనం అవుతోంది. సమస్య సెక్స్ కాదు. నాకు ఆయనే ముఖ్యం. ఆయన ఈ మధ్య రెండేళ్లుగా నాతో సరిగా ఉండటం లేదు. నన్ను అనుమానిస్తున్నారు. నాతో మాట్లాడరు. ఉద్యోగం సరిగా చేయరు. డాక్టర్‌ని కలుద్దామంటే రారు. డాక్టరు వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవడం నాకు ఆనందం కోసం కాదు. ఆయన బాధ తగ్గడం కోసం. కానీ, ఎంత చెప్పినా హాస్పిటల్‌కు రారు. ఏం చేయమంటారో చెప్పండి. -మంజుల

నిజంగా ఈ సమస్య వల్ల ఇద్దరూ బాధపడుతున్నారు. భర్తకు సెక్స్ సమస్య ఉంటే భార్య అర్థం చేస్కోదని భర్తలు ఎందుకు అనుకుంటారు? ఇద్దరికీ సమస్యే కదా. శీఘ్రస్ఖలన సమస్య జలుబు లాంటిది. ప్రపంచంలో కోటానుకోట్ల మంది పురుషులకు ఇది ఉంది. ఇది తగ్గని సమస్య ఏ మాత్రమూ కాదు. శీఘ్రంగా అంటే త్వరగా అయ్యే స్కలనాన్ని ఆపి, అంగస్తంభన కాలాన్ని పెంచే సెక్స్ థెరపీలో కొన్ని అద్భుతమైన టెక్నిక్స్ సాధన చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. కొన్ని భర్త విడిగా, కొన్ని భార్య సహకారంతో చేయాలి. ఫర్ఫార్మెన్స్ ఆంగ్జెటీ వల్ల శీఘ్రస్ఖలనం వస్తుంది. శీఘ్రస్ఖలనం తగ్గక పోతే ఫర్ఫార్మెన్స్ ఆంగ్జెటీ ఇంకా ఎక్కువవుతుంది. దీనికి సైకోథెరపీ ఉంది. శీఘ్రస్ఖలన సమస్యకు మానసిక కారణాలలో విపరీతమైన ఆందోళన, భయం, అజ్ఞానం, భాగస్వామి తిరస్కారం వంటివి ఉన్నాయి. ఇక శారీరక కారణాల్లో సెక్స్ కండరాలు బలహీనంగా ఉండటం, తరచూ వచ్చే మూత్రనాళపు ఇన్ఫెక్షన్స్, ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ ఫెక్షన్స్, డయాబెటిన్, బీపీ వంటివి. ఏదేమైనా మిమ్మల్ని ఆనందపరచలేకపోతున్నానన్న బాధలోంచి వచ్చిన కోపం, చిరాకు, ఆత్మన్యూనత మిమ్మల్ని అనుమానించే స్థాయికి తీసుకెళ్లాయి. సెక్స్ కంటే తన ప్రేమే ముఖ్యమని భరోసా ఇవ్వండి. శీఘ్రస్ఖలనం అవమానకరమైన, సిగ్గుతో భయపడే అంశం కాదు. మీ వారిని సెక్సాలజిస్ట్ వద్దకు తీసుకెళ్ళండి. ఇద్దరికీ కౌన్సెలింగ్, సెక్స్ సైకోథెరవీ చాలా అవసరం. రెండు రోజుల చికిత్సతో తగ్గిపోయే దానికి జీవితాన్ని నరకంలో మార్చుకోకండి.

-డాక్టర్ భారతి. MS

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Next Story

Most Viewed