కేసీఆర్‌ నుంచి పిలుపు.. వరంగల్ BRS అభ్యర్థిగా తాటికొండ రాజయ్య!

by GSrikanth |
కేసీఆర్‌ నుంచి పిలుపు.. వరంగల్ BRS అభ్యర్థిగా తాటికొండ రాజయ్య!
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. శుక్రవారం రాజయ్యకు కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో హుటాహుటిన రాజయ్య ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు బయలుదేరారు. భేటీ అనంతరం రాజయ్య పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ టికెట్‌ను రాజయ్యకు ఇచ్చేందుకు కేసీఆర్ నిరాకరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య కాదని కడియం శ్రీహరికి టికెట్ కేటాయించారు. దీంతో అసంతృత్తికి గురైన రాజయ్య.. కొన్నాళ్లు మౌనంగా ఉండి.. ఇటీవలే బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. కానీ, ఇంతవరకు ఏ పార్టీలోనూ చేరలేదు. కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభిస్తే మళ్లీ బీఆర్ఎస్‌లో చేరి వరంగల్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.

Advertisement

Next Story

Most Viewed