- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పోలింగ్ కేంద్రంలో BJP రాష్ట్ర అధ్యక్షుడికి ఒకే ఒక్క ఓటు
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తమిళనాడులో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశాడు. ముఖ్యంగా ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో నిత్యం ఆయనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుండేవారు. అయితే, తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అన్నామలై ఘోర పరాజయం పాలయ్యారు. తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన డీఎంకే అభ్యర్థి గణపతి రాజ్‌కుమార్ చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో అన్నామలైకి 450132 ఓట్లు రాగా, గెలిచిన గణపతి రాజ్‌కుమార్‌కు 568200 ఓట్లు పోలయ్యారు. మొత్తంగా లక్షా 18 వేల పైచిలుకు ఓట్ల తేడాతో అన్నామలై ఓటమి చెందారు. ఇదిలా ఉండగా.. ఓ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రంలో అన్నామలైకి కేవలం ఒకే ఒక్క ఓటు పోలైనట్లు సమాచారం. పోటీలో రెండో స్థానంలో కొనసాగుతున్న అన్నామలైకి ఓ పోలింగ్ బూత్‌లో ఒక్కటే ఓటు పడటం గమనార్హం. దీనికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.