NTR లాంటి నేతకే ఒడిదుడుకులు తప్పలేదు: కేసీఆర్

by GSrikanth |
NTR లాంటి నేతకే ఒడిదుడుకులు తప్పలేదు: కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌ను వీడుతున్న నేతలపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్ వేదికగా పలు పార్లమెంట్ సెగ్మెంట్ల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీని వీడుతున్న నేపథ్యంలో మనకు ఎలాంటి నష్టం లేదని నేతలకు ధైర్యం చెప్పారు. మహా నాయకుడు ఎన్టీఆర్ లాంటి వాళ్లకే రాజకీయాల్లో ఒడిదుడుకులు తప్పలేదని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా కాలేదు.. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. ఆ వ్యతిరేకతను మనం సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు.

రానున్న రోజుల్లో కాంగ్రెస్ నేతలే కొట్టుకుంటారని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం మనకు వచ్చిందని.. ప్రతిపక్షం దెబ్బ ఎలా ఉంటదో ప్రభుత్వానికి చూపిద్దామని పిలుపునిచ్చారు. అనంతరం పార్లమెంట్‌ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. కరీంనగర్‌కు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్‌, ఖమ్మం నామా నాగేశ్వరరావు, మహబూబూబాద్‌ స్థానానికి మాలోత్‌ కవిత పేర్లను ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed