అధికారిక ప్రకటన.. లోక్‌సభ ఎన్నికల బరిలో మాజీ ముఖ్యమంత్రి

by GSrikanth |
అధికారిక ప్రకటన.. లోక్‌సభ ఎన్నికల బరిలో మాజీ ముఖ్యమంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించారు. కర్ణాటకలోని మాండ్య పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. బీజేపీతో పొత్తులో భాగంగా తమ పార్టీ మాండ్య, కోలార్, హాసన్ స్థానాల నుంచి పోటీ చేస్తుందని కుమారస్వామి ప్రకటించారు. మొత్తం 28 ఎంపీ స్థానాలు ఉన్న కర్ణాటకలో రెండు దశల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఏప్రిల్ 26, మే 7వ తేదీల్లో పోలింగ్ జరుగనుంది. కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ, జేడీఎస్‌లు పొత్తు పెట్టుకున్నాయి. పొత్తు ఒప్పందం ప్రకారం జేడీఎస్‌కి పోటీ చేసేందుకు మూడు లోక్ సభ నియోజకవర్గాలు కేటాయించారు.




Advertisement

Next Story