తొలిసారి పోటీకి దూరంగా కోమటిరెడ్డి కుటుంబం

by GSrikanth |
తొలిసారి పోటీకి దూరంగా కోమటిరెడ్డి కుటుంబం
X

దిశ, వెబ్‌‌డెస్క్: 2009 నుంచి వరుసగా భువనగిరి సెగ్మెంట్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కోమటిరెడ్డి కుటుంబం తొలిసారి పోటీకి దూరంగా ఉంది. 2009లో భువనగిరి నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యర్థి(సీపీఎం) నోముల నర్సింహయ్యపై గెలుపొందారు. అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్‌ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో బూర నర్సయ్యపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపొందారు. తాజాగా.. ఇప్పుడు(2024) జరుగుతున్న ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

ఈ నియోజకవర్గానికి నాలుగో సారి ఎన్నికలు జరుగుతుండగా.. అనూహ్యంగా కోమటిరెడ్డి కుటుంబం పోటీకి దూరంగా ఉండటంపై నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో భువనగిరి టికెట్‌ను బీసీ వ్యక్తికి ఇప్పించాలని కోమటిరెడ్డి సోదరులు ఇద్దరు మొదటి నుంచి తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ, అధిష్టానం అనూహ్యంగా మళ్లీ రెడ్డిలకే కేటాయించడంతో కోమటిరెడ్డి సోదరుల మద్దతు సంపూర్ణంగా ఉంటుందో లేదో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed