- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పై ఎఫ్ఐఆర్ నమోదు
దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులోని అన్ని పార్లమెంట్ స్థానాలకు మొదటి విడతలో ఈ నెల 19 ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలై ఈ సారి ఎక్కువ సీట్లలో విజయం సాధించి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా బీజేపీ పెద్దలు కూడా ప్రచారం చేస్తున్నారు. దీంతో గురువారం రాత్రి కోయంబత్తూరులో అన్నమలై ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో TN బీజేపీ చీఫ్ రాత్రి పది గంటల సమయం దాటినప్పటికీ ప్రచారం కొనసాగించారు. దీంతో పోల్ కోడ్ ఉల్లంఘించినందుకు అన్నామలై పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే కోయంబత్తూరు జిల్లా బీజేపీ కార్యదర్శి రమేష్ కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే అవకాశం ఉందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.