- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్, RS ప్రవీణ్ కుమార్ పొత్తుపై కాంగ్రెస్ రియాక్షన్
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్, బీఎస్పీలు ఒక్కటయ్యాయి. మంగళవారం హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో ఇరు పార్టీల అధినేతలు కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయి పొత్తు ప్రకటించారు. తాజాగా.. ఈ పొత్తుపై కాంగ్రెస్ నేత మల్లు రవి స్పందించారు. ఎన్నికల వేళ రాజకీయాల్లో పొత్తులు సర్వసాధారణం అని అన్నారు. కేంద్రంలో ఏర్పడిన ఇండియా కూటమిలో బీఎస్పీ లేదని, అందుకే బీఆర్ఎస్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిశారని గుర్తుచేశారు.
నాగర్ కర్నూలు లోక్‌సభ సీటు నాకే వస్తుందన్న నమ్మకం ఉందని మల్లు రవి అభిప్రాయం వ్యక్తం చేశారు. తనకు టికెట్ కేటాయింపు ఖరారైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కాదు.. నాగర్ కర్నూలు నుంచి కేసీఆర్ పోటీ చేసినా ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ముందుంది మొత్తం కాంగ్రెస్ కాలమే అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మునిగిపోయే నావలో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు.