‘మోడీ కులాన్ని అడుగడుగుతా రాహుల్ గాంధీ అవమానిస్తున్నారు’

by GSrikanth |
‘మోడీ కులాన్ని అడుగడుగుతా రాహుల్ గాంధీ అవమానిస్తున్నారు’
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ కులాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అవమానిస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు. గురువారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ జయంతిలో పాల్గొన్న లక్ష్మణ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫూలే ఆశయాలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో 30 శాతం బీసీలకు బీజేపీ సీట్లు ఇచ్చిందని అన్నారు.


గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ బీసీలపై మొసలి కన్నీరు కారుస్తోందని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం బీసీ గణన అంటే కాంగ్రెస్‌ను ఎవరూ నమ్మరు అని చెప్పారు. ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా అడుగడుగునా ప్రధాని మోడీ కులాన్ని రాహుల్ గాంధీ అవమానిస్తూ వస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జూన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు.. బీసీలకు 46 శాతం రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.

Advertisement

Next Story