రాహుల్ గుండె చప్పుడులోనూ మోడీనే: బూర

by GSrikanth |
రాహుల్ గుండె చప్పుడులోనూ మోడీనే: బూర
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇవ్వాళ ఎవరి గుండెపై స్టెతస్కోప్ పెట్టినా మోడీ అనే వినిపిస్తోందని, నిద్రలో రాహుల్ గాంధీ గుండెపై పెట్టినా మోడీ అనే వినిపిస్తుందని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను ఒక డాక్టర్‌గా అనుభవంతో చెప్తున్నానన్నారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశం ఎవరి చేతిలో సురక్షితంగా ఉంటుందో ప్రజలు ఆలోచించాలన్నారు. దేశం మోడీ చేతిలో సేఫ్‌గా ఉంటుందనే విషయంలో రాహుల్ గాంధీకి కూడా ఎలాంటి డౌట్ లేదని ఆయన అన్నారు. మోడీ అంటే త్రీడీ అని, త్రీడీ అంటే దేశం, ధర్మం, డెవలప్మెంట్ అని నర్సయ్య గౌడ్ తెలిపారు. ప్రధాని మోడీని ఒక్క వైపు మాత్రమే చూడాలని, మోడీని ప్రత్యర్థి పార్టీలు ఒక వైపు మాత్రమే చూడాలని, మరోవైపు చూడాలనుకుంటే మాడి మసై పోతారని బూర వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story