- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ గాంధీవి పిల్ల చేష్టలు.. అమిత్ షా సెటైర్
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీకి మధ్య జరుగుతున్న ఎన్నిక అన్నారు. ఇది జిహాద్‌కు, అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నికగా అభివర్ణించారు. కుటుంబాన్ని అభివృద్ధి చేసుకునే పార్టీకి ఓటేస్తారో.. దేశాభివృద్ధికి పాటుపడే పార్టీకి ఓటు వేస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీవి పిల్ల చేష్టలు అని.. ఆయన గ్యారంటీలను ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు.
మొదటి మూడు విడతల్లో బీజేపీ 200 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ 10 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈసారి 400 సీట్లు సాధిస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల మధ్య ట్రయాంగిల్ బంధముందని, ఈ మూడు పార్టీలు కలిసి రామనవమి ఊరేగింపు కూడా జరగనివ్వవని అమిత్ షా తెలిపారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం కూడా జరుపుకోనివ్వరన్నారు. ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణలో షరియా, ఖురాన్ ఆధారిత పాలన సాగించాలని చూస్తున్నారని అమిత్ షా తెలిపారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు.