- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రసవత్తరంగా ట్రయాంగిల్ ఫైట్.. KCR, హరీష్‌కు కత్తి మీద సాములా మెదక్ సీటు
దిశ, తెలంగాణ బ్యూరో: మెదక్ ఎంపీ సీటు ఇటు మామ కేసీఆర్, అటు అల్లుడు హరీశ్ రావుకు సవాల్ గా మారింది. సిట్టింగ్ స్థానం నిలుపుకునేందుకు వారు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. మెదక్ సీటు కైవసం కత్తిమీద సాములా మారింది. ఈ సీటుపైనే కాంగ్రెస్, బీజేపీ సైతం స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఆయా పార్టీల జాతీయ నాయకత్వం వచ్చి ప్రచారం చేస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా మెదక్ సీట్ హాట్ టాపిక్ అయింది. రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలు ఉండగా, అందులో మెదక్ స్థానంలో గతంలో ఎప్పుడు లేని విధంగా బీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్, బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వారిద్దరికీ ఇప్పుడు సవాల్ గా మారింది. దీంతో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి మెదక్ పరిధిలోని నర్సాపూర్, మెదక్, పటాన్ చెరు, సిద్దిపేటలో కేసీఆర్ రోడ్ షోలు చేశారు. అంతేగాకుండా హరీశ్ రావు సైతం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. శనివారం కేసీఆర్ సిద్దిపేటలో చేపట్టిన రోడ్ షో కేడర్ లో జోష్ నింపినట్లయింది.
మెదక్ పై కాంగ్రెస్, బీజేపీ స్పెషల్ ఫోకస్
కేసీఆర్, హరీశ్ రావు మెదక్ పార్లమెంట్ పరిధి నుంచే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో వారి ఆధిపత్యం తగ్గించాలంటే గెలిచి తీరాల్సిందేనని భావించిన కాంగ్రెస్, బీజేపీ జాతీయ నాయకత్వాలు మెదక్ సీటుపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. బీజేపీ నుంచి ప్రధాని మోడీ ప్రచారం నిర్వహించగా, కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు విస్తృత పర్యటనలు చేశారు. రాష్ట్రంలో జాతీయ పార్టీల గాలి వీస్తుండడంతో బీఆర్ఎస్ గెలుపు కత్తిమీద సాములా మారింది.
మెజార్టీపైనే బీఆర్ఎస్ ఫోకస్
బీఆర్ఎస్ పార్టీ మెదక్ లో మెజార్టీపైనే ఫోకస్ పెట్టింది. 2019 లోకసభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి కి 5,96,048 ఓట్లు రాగా, కాంగ్రెస్ కు 2,79,621 ఓట్లు, బీజేపీకి 2,01,567 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ 3,16,427 ఓట్ల మెజార్టీ సాధించింది. ఈసారి గత మెజార్టీ కంటే ఎక్కువ సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మెదక్ లో త్రిముఖ పోటీ నెలకొనడంతో గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ అయినా సాధించాలని ముమ్మర కసరత్తు చేస్తోంది.
ఓటింగ్ తగ్గితే పార్టీకి, వారికి గడ్డుకాలమే..
అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటులో 14,37,897 ఓట్లు పోల్ కాగా కాంగ్రెస్ కంటే 2,48,074 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఈ మెజార్టీ తగ్గకుండా బీఆర్ఎస్ అధిష్టానం చర్యలు చేపట్టింది. అదే విధంగా సిద్దిపేటలో హరీశ్ రావుకు 1,05,514 ఓట్లు రాగా, కాంగ్రెస్-బీజేపీ కంటే 82,308 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. గజ్వేల్ లో 1,11,684 ఓట్లు రాగా కాంగ్రెస్ కంటే 79,116 ఓట్లు, బీజేపీ కంటే 45,031 ఓట్ల మెజార్టీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. ఓటింగ్ తగ్గితే రాబోయే కాలంలో పార్టీకి, వారికి గడ్డుకాలం ఎదురవుతుందని భావించిన పార్టీ అధిష్టానం ప్రత్యేక వ్యూహరచనతో ముందుకెళ్తోంది.
రసవత్తరంగా ట్రయాంగిల్ ఫైట్
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీజేపీ నుంచి రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. ముగ్గురు బలమైన నాయకులు కావడంతో వారి సామాజిక వర్గాలు సైతం మెదక్ లోక్ సభ పరిధిలో బలంగా ఉండటం, మరోవైపు పార్టీ అధిష్టానాలు సైతం ప్రచారంలో పాల్గొనడంతో ట్రయాంగిల్ ఫైట్ నెలకొంది. దీంతో సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా గెలిపించుకోవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ, మాజీ మంత్రి హరీష్ రావు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ గెలుపుపైనే పార్టీ మనుగడ ఆధారపడి ఉంది. భవిష్యత్ లో ప్రత్యర్థులకు విమర్శనాస్త్రాలుగా మారకుండా ఉండాలంటే మెదక్ పై గులాబీ జెండా ఎగరాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. అయితే ప్రజల తీర్పు ఎలా ఉంటుందోనని సర్వత్రా చర్చనీయాంశమైంది.