భువనగిరి నుంచి పోటీ చేయాలని కోమటిరెడ్డి అడిగారు.. నేను చేయనని చెప్పా: కాంగ్రెస్ నేత

by GSrikanth |
భువనగిరి నుంచి పోటీ చేయాలని కోమటిరెడ్డి అడిగారు.. నేను చేయనని చెప్పా: కాంగ్రెస్ నేత
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో బుధవారం మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ తనను భువనగిరి ఎంపీగా పోటీ చేయాలని అడిగినట్లు తెలిపారు. అయితే.. తనకు భువనగిరి నుంచి పోటీచేసే ఉద్దేశం లేదని క్లియర్‌గా చెప్పానని స్పష్టం చేశారు. తెలంగాణ వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలదే రాజ్యాధికారం అనుకున్నాం.. కానీ గత పదేళ్ల పాలన అందుకు భిన్నంగా జరిగిందని అన్నారు.

దొరలకు వ్యతిరేకంగా పోరాటాలు, ఉద్యమాలు చేసిన గడ్డ తెలంగాణ అని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడ్డాక పదేళ్ల పాటు తెలంగాణను దొరలే ఏలారని అన్నారు. కాగా, కాంగ్రెస్‌లో భువనగిరి సీటు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నియోజకవర్గ అభ్యర్థి విషయంలో సీఎం వర్సెస్ కోమటిరెడ్డి సోదరుల మధ్య ఫైట్ నడుస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. భువనగిరి సీటు బీసీలకే ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి డిమాండ్ చేశారు. మరి అధిష్టానం ఎవరిని ఫైనల్ చేస్తుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed