Viral News: అక్కడ 100% ఓటింగ్.. ట్విస్ట్ మాములుగా లేదుగా..!

by Indraja |
Viral News: అక్కడ 100% ఓటింగ్.. ట్విస్ట్ మాములుగా లేదుగా..!
X

దిశ వెబ్ డెస్క్: నిన్న 2024 సార్వత్రిక ఎన్నికలకు తొలి విడత పోలింగ్ ముగిసింది. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. కాగా అరుణాచల్ ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో మాలెగావ్‌ అనే మారుమూల గ్రామంలో 100% ఓటింగ్ నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజావ్‌ జిల్లాలోని మాలెగావ్‌ అనే మారుమూల గ్రామం చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉంది.

కాగా ఈ గ్రామం అరుణాచల్‌ ఈస్ట్‌ లోక్‌సభ, హుయులియాంగ్‌ అసెంబ్లీ పరిధిలోకి వస్తుంది. కాగా ఈ గ్రామంలో కొన్ని కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. కాగా ఆ కుటుంబాలు కూడా వేరే నియోజవర్గం పరిధిలోకి మారిపోయాయి. అయితే సొకేలా తయాంగ్‌ (44) అనే మహిళ మాత్రం మరో నియోజకవర్గానికి మారడానికి నిరాకరించారు. దీనితో ఆ ఒక్క మహిళల కోసం ఆ గ్రామంలో తాత్కాలికంగా ఓ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ గ్రామం పర్వతాల నడుమ, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నడుమ ఉంది.

దీనితో దాదాపు 39 కిలోమీటర్లు నడకమార్గంలో వ్యయప్రయాసలకు ఓర్చి ఎన్నికల సిబ్బంది ఆ గ్రామాన్ని చేరుకున్నారు. కాగా ఎన్నికల సిబ్బంది ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఆ మహిళ వచ్చి ఓటు వేశారు. దీనితో ఆ నియోజకవర్గంలో 100 % పోలింగ్ నమోదైంది. అయితే ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునేలా చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం చేసిన కృషికి పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇదికదా ప్రజాస్వామ్యం అంటే అని ఒక్క ఓటరు కోసం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘాన్ని కొనియాడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed