- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియన్ ఇండిపెండెన్స్.. స్ఫూర్తి నింపే పోరాటాలు..!
దిశ, వెబ్‌డెస్క్: భారత స్వాతంత్ర ఉద్యమం తీరుతెన్నలు నేటి తరానికి స్ఫూర్తిని నింపడంలో మార్గదర్శనం చేస్తాయి. నేడు జరిగే అనేక పోరాటాలకు స్వాతంత్ర పోరాటం ఓ బెంచ్ మార్క్‌గా నిలుస్తుంది. అయితే నాటి సిపాయిల తిరుగు బాటు నుంచి క్విట్ ఇండియా ఉద్యమం వరకు సాగిన స్వాతంత్ర పోరాటానికి బ్రిటీష్ పాలకులు తలొగ్గాల్సి వచ్చింది. స్వాతంత్ర కాంక్ష దేశ ప్రజల్లో నిండి ఉద్యమం ఉధృతం అవుతుండటం, ఉద్యమాన్ని ఆపడం సాధ్యం కాకపోవడంతో 1947 ఆగస్టు 15న భారతదేశానికి బ్రిటీష్ ప్రభుత్వం స్వాతంత్రం ప్రకటించింది.
తొలి పోరాటం ఇలా..
1857-58 మధ్యకాలంలో సిపాయిల తిరుగుబాటుతో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరు స్టార్ట్ అయింది. భారత చరిత్ర కారులు ఈ తిరుగుబాటుని ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంగా భావిస్తారు. భారత సిపాయిలకు, బ్రిటీష్ అధికారులకు జాతీయ సాంస్కృతిక వైరుధ్యాలు తిరుగుబాటుకి కారణమయ్యాయి. ఈ తిరుగు బాటుకు ప్రధాన కారణం బ్రిటీషర్ల రైఫిళ్లలో ఆవు, పంది కొవ్వు పూసిన తూటాలను వాడటం, వాటిని సిపాయిలు నోటితో తొలిచి రైఫిళ్లలో నింపాల్సి రావడంతో హిందూ, ముస్లిం సిపాయిలు వాటిని వాడటాన్ని తీవ్రంగా నిరాకరించారు. 1857 మర్చి నెలలో 34వ దేశీయ పదాతిదళపతికి చెందిన మంగళ్ పాండే అనే సైనికుడు బ్రిటీష్ సార్జంట్ మీద దాడి చేసి అతని సహాయకుడిని గాయపరిచాడు. మంగళ్ పాండేని బంధించాలని బ్రిటీష్ అధికారి ఆజ్ఞాపించడం జమేదార్ అతని ఆజ్ఞని తిరస్కరించడంతో తిరుగుబాటు ఉధృతమయింది.
‘స్వరాజ్యం నా జన్మహక్కు’
బాల గంగాధర్ తిలక్ మొదటిసారిగా స్వరాజ్య వాదాన్ని వినిపించారు. భారతీయ సంస్కృతిని, చరిత్రను, విలువలను కించపరిచే విధంగా ఉన్న బ్రిటీష్ విద్యావ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. జాతీయ వాదులకు భావ ప్రకటనా స్వేచ్ఛ లేకపోవడాన్ని సహించలేకపోయాడు. ఈ నేపథ్యంలో ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ విప్లవ నినాదాన్ని ఇచ్చారు. ఇది స్వాతంత్ర పోరాటం సందర్భంగా భారతీయుల్లో విశేషమైన స్ఫూర్తిని నింపింది. తిలక్ అతివాద మార్గమే స్వరాజ్య సాధనకు మార్గంగా భావించారు. బిపిన్ చంద్రపాల్, లాలా లజపతిరాయ్, వంటి ప్రజానాయకులు తిలక్ భావజాలాన్ని సమర్ధించారు. వీరు ముగ్గురు ‘లాల్, బాల్, పాల్’గా స్వాతంత్ర ఉద్యమంలో ప్రసిద్ధిగాంచారు.
స్వాతంత్ర పోరాటంలో గాంధీ ఎంట్రీ..
మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ దక్షిణాఫ్రికాలో తొలుత జాతి వివక్షపై 1914లో పోరాడారు. భారతీయుల పౌర హక్కుల కోసం సాగించిన పోరాటంలో విజయం సాధించారు. భారత్‌లో రౌలట్ చట్టం, కూలీల పట్ట వివక్షను వ్యతిరేకించాడు. ఈ సమయంలో గాంధీ సత్యాగ్రహం అనే ఉధ్యమాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. కూకా ఉద్యమం స్ఫూర్తిగా గాంధీజీ ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు.
అహింసాయుతంగా సహాయ నిరాకరణ ఉద్యమం నిర్వహించాలని తలంచి లక్షల మంది సామాన్య ప్రజల్లో ఆలోచనలు రగిల్చాడు. ఆనాటి బ్రిటిష్ పాలనపై అలుపెరగకుండా పోరాడి విజయం సాగించారు. 1917లో చంపారన్ సత్యాగ్రహం, ఖేడా సత్యాగ్రహం, 1919లో ఖిలాఫత్ ఉద్యమం, 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం, 1930లో దండి మార్చ్, 1930లోనే శాసనోల్లంఘన ఉద్యమాలకు గాంధీ రూపకల్పన చేశారు. అంశాల వారీగా బ్రిటీష్ వారి నిరంకుష పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేశారు.
అహ్మాదాబాద్ నుంచి దండి వరకు కాలినడకన 400 కిలో మీటర్లు పాద యాత్ర సాగించి ఉప్పు సత్యాగ్రహం చేపట్టారు. ఇది దండి యాత్రగా ప్రసిద్ధి చెందింది. 1942లో రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయులను పంపించడాన్ని నిరసిస్తూ ‘క్విట్ ఇండియా ఉద్యమం’ స్టార్ట్ అయింది. అయితే భారతదేశంలో స్వేచ్ఛ కోసం ఉద్యమాలు గ్రామగ్రామానికి వ్యాపించాయి. ఈ ఉద్యమాలను ఆపలేక, బ్రిటిష్ పాలకులు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేందుకు చర్చలు ప్రారంభించారు.