పంత్‌ను అవుట్ చేసి అరుదైన రికార్డు సృష్టించిన చాహల్

by Harish |
పంత్‌ను అవుట్ చేసి అరుదైన రికార్డు సృష్టించిన చాహల్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా, రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ ఐపీఎల్-17లో మరో రికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్‌లో 350 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంత్‌ను అవుట్ చేయడంతో చాహల్ ఈ ఘనత సాధించాడు. ఈ ఫీట్ సాధించిన 5వ స్పిన్నర్‌గా, ఆసియాలో 6వ బౌలర్‌గా నిలిచాడు. అతనికి ఇది 301వ మ్యాచ్. 350 వికెట్లలో టీమ్ ఇండియా తరపున 96 సాధించగా.. ఐపీఎల్‌లో 201 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అతను 11వ స్థానంలో ఉన్నాడు. విండీస్ మాజీ క్రికెటర్ బ్రావో 625 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ తరపున చాహల్ తర్వాతి స్థానంలో పీయూశ్ చావ్లా 310 వికెట్లతో ఉన్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో సత్తాచాటుతున్న చాహల్ 11 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీశాడు.

Advertisement

Next Story

Most Viewed