ఆ రెండు సందర్భాల్లో నా గుండె బద్దలైంది : విరాట్ కోహ్లీ

by Harish |
ఆ రెండు సందర్భాల్లో నా గుండె బద్దలైంది : విరాట్ కోహ్లీ
X

దిశ, స్పోర్ట్స్ : కెరీర్‌లో రెండు సందర్భాల్లో తన గుండె బద్దలైందని టీమ్ ఇండియా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. అవి రెండు 2016లోనే జరిగాయని చెప్పాడు. తాజాగా జియో సినిమాతో విరాట్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 2016లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో విండీస్ చేతిలో టీమ్ ఇండియా ఓడిపోయింది. అదే ఏడాది జరిగిన ఐపీఎల్‌లో ఫైనల్‌కు చేరిన బెంగళూరు.. హైదరాబాద్ చేతిలో పరాజయం పాలైంది. ఈ రెండు సందర్భాల్లో తన హార్ట్ బ్రేక్ అయ్యిందని విరాట్ చెప్పాడు. హైదరాబాద్‌పై మ్యాచ్‌ను చేజేతులా కోల్పోయామని, 42 బంతుల్లో 68 పరుగులు, చేతిలో8 వికెట్లు ఉన్నప్పడు మ్యాచ్‌ను ఎలా ఓడిపోయామనిపిస్తుందని గుర్తు చేసుకున్నాడు. ఈ రెండు సందర్భాల నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందన్నాడు.

నేను ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు

తన స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు చేసే వారిపై మరోసారి కోహ్లీ ఫైర్ అయ్యాడు. ‘గ్రౌండ్‌లో నేను చేయగలనో నాకు తెలుసు. నేను ఎలాంటి ఆటగాడినో, నా సామర్థ్యాలేంటో ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాచ్ ఎలా గెలవాలని నేను ఎవరినీ అడగను. నేను ఓటముల నుంచి నేర్చుకున్నా. మీరు ఒకటి లేదా రెండుసార్లు గెలిచి ఉండొచ్చు. కానీ, మళ్లీ మళ్లీ గెలుస్తున్నామంటే అది యాదృచ్చికంగా కాదు.’ అని విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు.

రోహిత్‌తో ఏకీభవిస్తున్నా..

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ రూల్ గేమ్ బ్యాలెన్స్ దెబ్బతీస్తుందని చెప్పాడు. అలాగే, ఆల్‌రౌండర్లు నష్టపోతున్నారన్న రోహిత్ శర్మ వ్యాఖ్యలతో విరాట్ ఏకీభవించాడు. ‘ఒకరి ఆధిపత్యమే ఉండకూడదు. బ్యాటు, బంతికి మధ్య సమతూల్యత ఉండాలి.’అని తెలిపాడు.

Advertisement

Next Story