అనుష్క శర్మకు కోహ్లి ఫ్లయింగ్ కిస్

by Sathputhe Rajesh |
అనుష్క శర్మకు కోహ్లి ఫ్లయింగ్ కిస్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 16వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ పై ఆర్సీబీ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు ఓ దశలో ఓటమి దిశగా సాగింది. రాజస్థాన్ బ్యాట్స్ మెన్ యశస్వి జైస్వాల్(47), దేవదుత్ పడిక్కల్ (52) కీలక పార్ట్ నర్ షిప్ నిర్మించి తమ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే హర్షల్ బౌలింగ్ లో భారీ షాక్ కు యత్నించిన యశస్వి బౌండరీ లైన్ వద్ద విరాట్ చేతికి చిక్కాడు. అనంతరం రిలీఫ్ గా ఫీలైన విరాట్ గ్యాలరీలోని తన భార్య అనుష్క శర్మ వైపు చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. దీంతో ఆ వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే విరాట్ ఫ్లయింగ్ కిస్ కి అనుష్క స్మైల్ ఇచ్చింది. అయితే ఐపీఎల్ విరాట్ మరో ఘనత సాధించాడు. వంద క్యాచ్ లు పట్టిన మూడో క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.

Advertisement

Next Story