IPL2024: అంపైర్‌తో గొడవ.. విరాట్ కోహ్లీకి భారీ షాక్

by GSrikanth |
IPL2024: అంపైర్‌తో గొడవ.. విరాట్ కోహ్లీకి భారీ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యంత రసవత్తరంగా జరిగిన మ్యాచుల్లో నిన్నటి కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్ ఒకటి. చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగింది. చివరకు ఒక్క పరుగు తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఓ కీలక ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. ఆర్సీబీ కీలక ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. మ్యాచ్‌లో అంపైర్లతో గొడవ పడినందుకు ఈ ఫైన్ వేస్తున్నట్లు తెలిపింది. అయితే, కోహ్లీ అవుటైన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారమే అవుట్ ఇచ్చినట్లు స్టార్ స్పోర్ట్స్ ఒక ప్రకటనలో పేర్కొన్నది. మరోవైపు ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇరు జట్ల కెప్టెన్లు డూ ప్లెసిస్, సామ్ కరణ్‌లకు చెరో రూ.12 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story