- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. ఏకైక భారత క్రికెటర్‌గా
దిశ, స్పోర్ట్స్ : రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఐపీఎల్-17లో భాగంగా బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం లక్నో, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో అతను అరుదైన ఘనత సాధించాడు. ఎం.చిన్నస్వామి స్టేడియంలో అతనికి ఇది 100వ టీ20 మ్యాచ్. దీంతో ఒకే వేదికపై 100 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఏకైక భారత క్రికెటర్‌గా విరాట్ రికార్డుకెక్కాడు. వరల్డ్ క్రికెట్‌లో 15వ ప్లేయర్‌గా నిలిచాడు. 100 మ్యాచ్‌ల్లో భారత్ తరపున ఆరు మ్యాచ్‌లు ఆడగా.. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు 85 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 100 మ్యాచ్‌ల్లో 39.73 సగటుతో 3,298 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు ఉండగా.. 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ తర్వాత రోహిత్ శర్మ 80 మ్యాచ్‌లతో(వాంఖడే స్టేడియం, ముంబై), ఎం.ఎస్ ధోనీ 69 మ్యాచ్‌లతో(ఎం.ఏ చిదంబరం స్టేడియం, చెన్నయ్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.